Site icon NTV Telugu

Chandrababu : వాతావ‌ర‌ణంలో మార్పులు.. గ‌న్న‌వ‌రంలో చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్…

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. కానీ వాతావరణం అనుకూలించక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్‌ అయింది సీఎం హెలికాప్టర్‌. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్‌ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఈ రోజు పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.

read also : Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!

ఏపీలో పింఛన్లను ఇంటికే వెళ్లి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికే వెళ్లి పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు, ఇతర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. చంద్రబాబు వెళ్లిన ప్రతి ఇంటికి ఏదో ఒక హామీలు కూడా ఇస్తున్నారు. మరి ఈ సారి ఎవరి ఇంటికి వెళ్తారు, ఎలాంటి హామీలు ఇస్తారనేది తెలియాల్సి ఉంది.

read also : Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..

Exit mobile version