Chandrababu Naidu: మరో టీడీపీ నేతపై హత్యాయత్నం.. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు? అని నిలదీశారు.. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని ప్రశ్నించారు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న బాలా కోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగనే సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు..
Read Also: COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
Also Read
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్‌లో రాంబాబు స్పీడ్
ఇక, ఇదే ఘటనపై స్పందించిన నారా లోకేష్.. హత్యలు, దాడులతో టీడీపీ కేడర్‌ని భయపెట్టాలనుకుంటున్న జగన్ పాపాలు.. శిశుపాలుడి పాపాల్లా పండిపోయాయి అని వ్యాఖ్యానించారు.. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం చేయిస్తోన్న హత్యలు, దాడులే జగన్ పతనానికి దారులుగా అభివర్ణించారు.. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికీ వైసీపీ గూండాల పనేనని ఆరోపించారు.. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అవుతుందన్న ఆయన.. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే.. వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థం అవుతోందన్నారు.. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్‌లోనే వున్న జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇకనైనా హత్యా రాజకీయాలు, దాడులు ఆపండి.. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి.. జగన్ అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకి ఇదే చివరి హెచ్చరిక అన్నారు. మేం తిరగబడితే, వైసీపీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు? అని ప్రశ్నించారు నారా లోకేష్.
తాజావార్తలు
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
-
Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?