IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే..
ఫస్టాఫ్ చాలా నేచురల్‌గా, క్లీన్‌గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్‌ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్‌తో కథకు తగ్గట్టుగా మలిచాడు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్‌ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ.
Also Read
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
తాజావార్తలు
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
-
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!