Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి ఔటయ్యారు. ఇది టెస్టుల్లో ఆయనకు 68వ అర్ధశతకం. ఈ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ సమం చేశారు.
ప్రస్తుతం జో రూట్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. అలాగే టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చంద్రపాల్ (66 హాఫ్ సెంచరీలు) తర్వాతి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, భారత దిగ్గజం రాహుల్ ద్రావిడ్ చెరో 63 అర్ధశతకాలతో ఉన్నారు. కెప్టెన్‌గా కూడా రూట్‌కు ఘనమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా టెస్టుల్లో 42 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (61) అగ్రస్థానంలో ఉన్నారు.
Also Read
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 48.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ తలో 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. 2006 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లు ఐదేసి వికెట్లు తీయడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ 42 రన్స్ చేయగా, అబ్దుల్లా షఫీక్ 61 పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్, జో రూట్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి, 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
తాజావార్తలు
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!