Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరిగింది. కార్యకర్తల పోరాట పటిమ, ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన వ్యూహం అప్పటి పరిస్థితులకు, సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని పవన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గాల వారీగా రాజకీయ, సామాజిక పరిస్థితులను అంచనా వేసి పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పోటీ చేయాలని సూచించారు.
పొత్తు విషయం నేను చూసుకుంటా
కూటమి పొత్తులకు సంబంధించి పార్టీ నాయకులు ఎవరూ సొంతంగా వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పొత్తు అంశాన్ని తాను చూసుకుంటానని, పార్టీ లైన్‌కు భిన్నంగా ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, నాయకులకు సూచించారు. అదే సమయంలో కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రాంతాల్లో జనసేన శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
స్థానిక పరిస్థితులే ప్రాతిపదిక
నియోజకవర్గాల్లో జనసేన బలాబలాలను అంచనా వేసి, పార్టీకి తగిన స్థానాలను గుర్తించి నివేదిక అందించాలని ఎమ్మెల్యేలను పవన్ ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికులు, వీర మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పార్టీ వ్యూహం ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికల విధివిధానాలను రూపొందించేందుకు 9 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి జనసేన శ్రేణుల అభిప్రాయాలకు ఈ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది.
కార్యకర్తల సమస్యలపై దృష్టి
కార్యకర్తల సమస్యలను ఎమ్మెల్యేలు స్వయంగా విని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. 2019–24 మధ్య జనసేన శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని, 2024లో కూటమి విజయానికి వారి కృషి కీలకమని పేర్కొన్నారు. గత పోరాట అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులను రాజకీయంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనపై ధీమా
ప్రాంతాల వారీ పరిస్థితులను బట్టి జనసేన పోటీ చేసే స్థానాలను నిర్ణయించనుంది. పార్టీకి అనుకూలమైన స్థానాలను గుర్తించి బలమైన అభ్యర్థులను సిద్ధం చేయాలని నాయకత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా, గతంతో పోలిస్తే మెరుగైన స్థాయిలో నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!