Buggana Rajendranath: పోలవరంపై చంద్రబాబు అవాస్తవాలు చెప్తున్నారు అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. చంద్రబాబుకి పోలవరంపై అవగాహన లోపం ఉందన్నారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. పోలవరం మొదలు పెట్టింది మేమే అంటున్నారు.. ఇంకేం చెప్తాం వాళ్లకు, ఆయనకు చెప్పే వాళ్ళే లేరు.. పోలవరమే కాదు.. నాగార్జున సాగర్ కూడా చంద్రబాబు కట్టిండు అనేట్టు ఉందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంగా మేము మీరు చేసేది తప్పు అంటే.. ఆయనకు కోపం వస్తుంది అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు.
Read Also: Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం
ఇక, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే అన్ని పనులు కలిపి ఒకే టెండర్ పెట్టారు.. కానీ, చంద్రబాబు మేమే మొదలు పెట్టామని ఇప్పుడు అంటున్నారు.. ఏం చెప్పాలి మేము.. భూసేకరణ కుడి కాలువకి 2004 నుంచి 2014 వరకు జరిగిపోయింది.. 3 లక్షల 67 వేల ఎకరాలు భూమిని సేకరించారు.. 2014లో కేంద్ర కేబినెట్ 23 టీఎంసీల తాగునీటి కోసం వైజాగ్ ప్లాంట్ కి ఇచ్చే నీటిని కూడా వదిలేశారా లేదా? అని మాజీమంత్రి బుగ్గన ప్రశ్నించారు.