AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, మే 24 నాటికి అది బలపడి వాయుగుండంగా మారుతుందని, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు ఉత్తర ప్రాంతం వరకు విస్తరించి ఉండగా, మే 23 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణతో పాటు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. ఇవాల నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో విస్తరిస్తాయి.
Read also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుంచి సాంగ్ వచ్చేస్తుంది.. స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
ఇవాళ (మే 19) నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని.. మరో నాలుగు రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజుల్లో బలపడి మే 24 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కోస్తా ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ, కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం (మే 20)న 30, 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
Read also: SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్ రైజర్స్.. వరుణదేవుడు కరుణిస్తాడా..
హైదరాబాద్‌లో శనివారం భారీ వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మేడ్చల్, దుండిగల్, ప్రగతినగర్, నిజాంపేట్, కండ్లకోయ, గండిమైసమ్మ, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, నాగోల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బేగంపేట, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, జవహర్‌నగర్, చిలకలగూడలోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు విజయవాడ రహదారి రోడ్లు చెరువులా మారాయి. కొన్ని చోట్ల వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
GunFire : ఓహియో రాజధాని కొలంబస్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి..ముగ్గురికి గాయాలు
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!