పాపం ఈ దొంగ ఆమాయకుడిలా వున్నాడు. ఎలా దొంగతనం చేయాలో ఎక్కడ దొంగ తనం చేయాలో తెలియని లేద దొంగ. అచ్చం జులాయి సినిమాలో బ్రహ్మానందంలా దొంగతనాలు చేస్తూ ఒక్క నిమిషంలో దొరకిపోతుంటాడో అలాంటి దొంగ. గంట, పర్ఫ్యూమ్స్ దొంగతనం చేసి అప్పటి కప్పుడే బ్రహ్మానందం ఎలా పట్టుబడ్డాతాడో అలాగే ఈ దొంగ కూడా పట్టుపడ్డాడు. ట్రైన్ లో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన మహిళ అతన్ని పట్టుకుంది. దీంతో పాపం దొంగ ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసిన ఫలితం దక్కలేదు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అయినా ట్రైన్ స్టేషన్ వున్నప్పుడు మెడలో బంగారం చైనే కొట్టేద్దాం అనుకున్నాడు పాపం చివరకు పోలీసులకు చిక్కాడు.
Read also: Loan App Crime: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. విచారణలో షాకింగ్ నిజాలు
ఈఘటన అనంతపురం జిల్లా షిర్డీ నుండీ చెన్నై వెళ్లే రైలులో (ట్రైన్ నంబర్ 22602) S 12 కోచ్ లో జరిగింది. 45 వ బెర్త్ లో మహిళ నిద్రిస్తుంది. ఆమెను గమనించిన ఓ దొంగ స్థానిక రైల్వే స్టేషన్ కు రాగానే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. దీంతో తేరుకున్న మహిళ అరిచింది. దీంతో అక్కడున్న వారందరు ఆ దొంగను పట్టుకున్నారు. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని రైల్వే పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.
Read also: Street Dogs Solve Mystery: హత్య కేసుని చేధించి.. అవినీతిపరులైన ఖాకీల్ని పట్టించిన వీధి కుక్కలు
గత నెల సెప్టెంబర్ 16, 2022న ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. బిహార్‌లోని ఖగారియాలో ఈ సంఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Supreme Court: ఆయుధం రికవరీ కాకపోతే నిందితులను దోషులుగా నిర్ధారించవచ్చా?