Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. రెవెన్యూ లోటు నిధులు రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జనగ్ సర్కార్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇవాళ రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.879.08 కోట్లు విడుదల చేసింది. అయితే.. నిధుల పంపిణీ తర్వాత లోటు ఏర్పడిన రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈనేపథ్యంలో.. ఆర్థిక సంవత్సరం 2022, 2023లో రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.10,549 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేయగా, ఇప్పటి వరకు కేంద్రం రూ.3,516.33 కోట్లు విడుదల చేసింది. కాగా.. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించి ఆంధ్ర సహా 14 రాష్ట్రాలకు కలిపి రూ.7,183.42 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిధులు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ తో పాటూ అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌కు రెవెన్యూ లోటు విడుదల చేసింది కేంద్రం. అయితే.. ఈ 14 రాష్ట్రాలకు పోస్ట్ రివేల్యుయేషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను విడుదల చేయాలంటూ 15వ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసింది. దీంతో.. అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ ఈ రెవెన్యూ లోటు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..