వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అంతేకాకుండా ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల పాటు శ్రీకాంత్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఇటీవల జరిగిన క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆయనకు బెర్త్ కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం…