Byreddy Siddharth Reddy: కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసు..
- కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసు..
- ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ మాకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు..
- మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు..
- నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని పుకార్లు పుట్టించారు..
- నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకూ ఎవరినైనా అరెస్ట్ చేశారా?: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Siddharth Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని, వైసీపీ యువనేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు. మధ్యంతర బెయిల్ అనంతరం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తిరిగి రిమాండ్ కొనసాగుతున్న మిథున్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డితో పాటు రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిలా రెడ్డి ఇవాళ ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో మూడు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. నారా లోకేష్ భవిష్యత్తుకు మిథున్ రెడ్డి అడ్డుగా మారతాడనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అలాగే, సుగాలీ ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు టీడీపీ వారిపైనే ఆరోపణలు చేస్తున్నారని విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై దశల వారీగా ఉద్యమాలు చేస్తామని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Sprouts: మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తింటే మంచిదా? లేక ఉడికించి తింటే మంచిదా?
Also Read
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించిన విషయం కాదు అని శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసు అన్నారు. మిథున్ రెడ్డి గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా.. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఆరోపించారు. ఇంత వరకు మిథున్ రెడ్డి మీద కస్టడీ పిటిషన్ వేయలేదంటేనే ఇది అక్రమ కేసు అని మనం అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు 20 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా వెనక్కి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాగే, నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని అసత్య ప్రచారం చేశారు.. నకిలీ మద్యం కేసులో ఎవరినైనా ఇంత వరకు అరెస్టు చేశారా అని సిద్ధార్థ్ రెడ్డి అడిగారు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!