Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువంత వేసిన 23వ ఓవర్లో బౌండరీ కొట్టడంతో గిల్ 3,000 టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లో నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ 26 ఏళ్ల 349 రోజుల వయసులో 3,000 టెస్టు పరుగులు పూర్తి చేశారు. దాంతో ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లలో నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 23 ఏళ్ల 228 రోజులకే 3,000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 26 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకోగా.. దిలీప్ వెంగ్‌సర్కార్ 26 ఏళ్ల 263 రోజుల వయసులో 3,000 టెస్టు పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పుడు గిల్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌కు ఈ మైలురాయి మరింత ప్రత్యేకంగా మారింది. భారత టెస్టు జట్టును ముందుండి నడిపిస్తున్న సమయంలోనే 3,000 పరుగుల క్లబ్‌లోకి ప్రవేశించడం అతడి కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. తొలి టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆధిపత్యం కొనసాగించాలనే లక్ష్యంతో గిల్ సేన బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 32 ఓవర్లలో రెండు వికెట్స్ కోల్పోయి 110 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ (45), కేఎల్ రాహుల్ (18) పెవిలియన్‌కు చేరారు. శుభ్‌మన్ గిల్ (29), దేవదత్ పడిక్కల్ (22) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికి 96 బంతుల్లో 50 పరుగులు జోడించారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!