Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Advance Booking: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా బుక్‌మైషోలో టికెట్ అమ్మకాల జోరుతో ఇప్పటికే ఉన్న కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డులను కూడా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యష్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ఆగస్టు 21న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతోనే టికెట్ల కోసం భారీగా రద్దీ కనిపించింది. విడుదలకు నాలుగు రోజుల ముందే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన సినిమాపై ఉన్న అంచనాలను మరోసారి స్పష్టం చేసింది.
అందుతున్న సమాచారం ప్రకారం, కేవలం 48 గంటల్లోనే ‘టాక్సిక్’ భారత్‌లో అన్ని భాషల్లో కలిపి సుమారు 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.18 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో కన్నడ వెర్షన్ నుంచే సుమారు రూ.10 కోట్ల బుకింగ్స్ నమోదైనట్లు సమాచారం. హిందీ వెర్షన్ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు రూ.8 కోట్ల వరకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఉత్తర భారత మార్కెట్లో కూడా యష్‌కు ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బుక్‌మైషో టికెట్ అమ్మకాల పరంగా ‘టాక్సిక్’ మరో రికార్డును సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే ‘ధురందర్’ అడ్వాన్స్ బుకింగ్ ను దాటేసిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read
- Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
‘టాక్సిక్’కు మరో ప్లస్ పాయింట్ సెన్సార్ క్లియరెన్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ రూపొందించిన అసలు విజన్‌నే ప్రేక్షకులు థియేటర్లలో చూసే అవకాశం లభించనుంది. 1940ల నుంచి 1970ల మధ్య గోవా నేపథ్యంలో సాగే ఈ మూవీలో యష్ ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘టాక్సిక్’ బుకింగ్ స్క్రీన్షాట్లు, థియేటర్ హౌస్‌ఫుల్ పోస్టులు వైరల్ అవుతుండగా, విడుదల రోజున ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్ నమోదు చేస్తుందనే ఆసక్తి సినీ అభిమానుల్లో మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!