అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బుద్ధా వెంకన్న విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2), రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: గుడ్ న్యూస్… నేడు మహిళల ఖాతాల్లో రూ.15వేలు జమ
Also Read
- OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!
- OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?
- Local Body Elections: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ బిగ్ వార్నింగ్.. కలెక్టర్లు, ఎస్పీల వరకు అందరికీ లీగల్ నోటీసులు!
- AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
పోలీస్ స్టేషన్లో బుద్ధావెంకన్నను సుమారు 7 గంటల పాటు పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు మంగళవారం ఉదయం మీడియాకు చెప్తానన్నారు. పోలీసులు తనను అడిగిన విషయాల గురించి.. తనపై కొడాలి చేసిన వ్యాఖ్యల గురించి మొత్తం వివరిస్తానని తెలిపారు. ఈ విషయంలో అస్సలు తగ్గబోనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బుద్ధా వెంకన్న వివరించారు.
తాజావార్తలు
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
-
UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
-
School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
-
Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!