NTV Telugu Site icon

Thota Chandrasekhar: ఏపీలో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది

Thota Chandrasekhar

Thota Chandrasekhar

BRS Will Contest From All Constituencies In Andhra Pradesh Says Thota Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్‌నే ఏపీలో అమలు చేస్తామని అన్నారు. ఏపీకి ఎన్నో సమస్యలున్నాయని.. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలోనూ కేంద్రం సహకారం రావడం లేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.

Anakapalli Crimes: గుర్తు తెలియని శవాల కలకలం.. నెల రోజుల్లో రెండు హత్యలు

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో ఎన్నో సమస్యలు తలెత్తాయని.. ఇంతవరకు రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని.. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వేజోన్‌ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, వైజాగ్‌ నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదన్న ఆక్ష్న.. దక్షిణాదిపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వీటిపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్లు ఎవరూ లేరని.. కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ అవతరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని అన్నారు. దేశంలో స్వశక్తితో బీఆర్‌ఎస్‌ బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్‌కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.

Show comments