Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాలను సీఎం జగన్‌తో విన్ ఓవెన్ పంచుకున్నారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి తాము కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అటు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్ బృందానికి సీఎం జగన్ వివరించారు. యూకే- భారత్ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంపై బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు బ్రిటీష్ బృందం హామీ ఇచ్చింది. మరోవైపు ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్ బృందానికి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపైనా చర్చించారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
Read Also: Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ
వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ఓవెన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఈ సమావేశంలో బ్రిటీష్ కమిషన్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!