Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Botsa Vs Somu Veerraju Over Shivratri Poster

YSRCP Shivratri Poster: శివరాత్రి పోస్టర్ చిచ్చు.. వీర్రాజు vs బొత్స

Published Date :February 19, 2023 , 1:53 pm
By NTV WebDesk
YSRCP Shivratri Poster: శివరాత్రి పోస్టర్ చిచ్చు.. వీర్రాజు vs బొత్స
  • Follow Us :
  • google news
  • dailyhunt

Botsa vs Somu Veerraju Over Shivratri Poster: శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ తన అధికార ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ.. బీజేపీ వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెంటనే తొలగించాల్సిందిగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ పోస్టర్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల మనుగడ పూర్తిగా కనుమరుగు చేయడమే రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థల లక్ష్యంగా కనిపిస్తుందని ఆరోపించారు. ‘‘పేద వాళ్ళు అని పేర్కొంటూనే, చేతిలో డమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం & హిందువుల మనోభావాల పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక. ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ, హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ‘‘రాష్ట్రంలో ఉన్న గిరిజన సంకేమ హాస్టళ్ళు, BC, SC సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు సరిగా తిండిపెట్టలేరు గానీ మన సీఎం వైఎస్ జగన్ శివుడికి పాలుపోసి శివతత్వా న్ని బోదించేస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘అధికారమే పరమావధిగా భావిస్తూ.. హిందువులను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తారు. హైందవ ధర్మ విఘాతానికి పాల్పడే అసాంఘిక శక్తులను నిలువరించకపోగా, నేరుగా పార్టీ అధికారిక ఖాతా నుండే పరమేశ్వరుని కించపరిచే ప్రచారాలు చేయిస్తున్నారు. మీ భావజాలాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’ అంటూ మరో ట్వీట్‌లో ఫైర్ అయ్యారు.

Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండి

ఇందుకు మంత్రి బొత్స నారాయణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శివరాత్రి పోస్టింగ్ మీద బీజేపీది అనవసర రాద్దాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో బీజేపీ చెప్పాలన్నారు. బీజేపీ దిగజారుడు, వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించారు. డబుల్ తత్వాలు, తప్పుడు విధానాలు తమవి కావన్నారు. గుడులను కూల్చి ధర్నా చేసే సంస్కారం వాళ్లదని పేర్కొన్నారు. ఎంపీ జీవీఎల్ అందరికంటే మేధావా? MLC ఎన్నికల్లో 200 శాతం విజయం తమదేనన్నారు. దీనిని రెఫరెండంగా తీసుకుని హడావిడి చేయాల్సినంత అవసరం లేదని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డామనేది అర్ధంలేని ఆరోపణలని తేల్చి చెప్పారు. ఏయూ వైస్ ఛాన్సలర్ పాల్గోన్నారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.

Hyderabad Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

మరోవైపు.. బీజేపీ ఆఫీసులో శివరాత్రి పోస్టింగ్‌పై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ప్లకార్డులుతో నిరసనలో పాల్గోన్న ఎంపీ జీవీఎల్.. శివరాత్రి సందర్భంగా సీఎం జగన్ పెట్టిన పోస్ట్ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ బీసీ హాస్టల్స్‌లో విద్యార్థులు, పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హిందువులను కించపరిచే విధంగా ఆ పోస్ట్ ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ సమస్యలను ముందు పరిష్కారించండని డిమాండ్ చేశారు. సీఎం జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ ప్రచారాలు ఆర్భాటాలు మానుకోవాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • botsa satyanarayana
  • GVL Narasimha Rao
  • Somu Veerraju
  • YS Jagan Shivratri Poster
  • YSRCP Shivratri Poster

తాజావార్తలు

  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

  • Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

  • Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

  • West Bengal Elections: ఎన్నికల ఫలితాలపై సంచలన రిపోర్ట్.. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటే..!

  • Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions