జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా సమీక్ష సమావేసంలో చర్చించామని మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాడు-నేడు, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకం, హోసింగ్ తదితరుల అంశాలు పై చర్చించామని ఆయన వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని క్లియర్ చేయమని అధికారులను అదేశించామని, భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ విషయంపై స్పందిస్తూ మనం ఒక వ్యవస్థలో ఉన్నామని ఆయన అన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, వ్యక్తుల కోసం కాదు ..ప్రజల కోసం ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమా టికెట్స్ విషయంలో ఒక కమిటీని వేశామని, ఆ అంశం ఇంకా నడుస్తుందని ఆయన తెలిపారు. టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను పోస్ట్ పోన్ చేసుకోండని, చంద్రబాబుకి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టదు. కానీ సినిమా గురించి మాత్రం మాట్లాడుతాడని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఆంధ్రా విద్యార్థులు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అమరావతి రైతులు చేసేది ఉద్యమం కాదు. అది ఒక రాజకీయ ఉద్యమం.., టీడీపీ చేసే ఉద్యమని ఆయన ఆరోపించారు. టీడీపీకి సమిష్టిమైన ఆలోచనలేదని, జిల్లా మెడికల్ కళాశాల పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.