Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bonda Uma Allegations On Ycp Senior Leader Peddi Reddy Ramachandra Reddy

Bonda Uma: పెద్దిరెడ్డి కాదు పెద్దారెడ్డి.. జే గ్యాంగ్ ప్రధాన భాగస్వామి

Published Date :April 9, 2022 , 12:40 pm
By Ramesh Nalam
Bonda Uma: పెద్దిరెడ్డి కాదు పెద్దారెడ్డి.. జే గ్యాంగ్ ప్రధాన భాగస్వామి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్‌ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను సంపాదించారని.. మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి అక్రమార్జన అక్షరాలా రూ. 6889 కోట్లు అని తెలిపారు. శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టి పెద్దిరెడ్డి రూ.700 కోట్లు దోచారన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి రూ. 190 కోట్లు దోపిడీ చేశారని వివరించారు.

పెద్దిరెడ్డి మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి భారీ దొపిడీకి తెర లేపారని బోండా ఉమ ఆరోపించారు. త్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూ దొపిడీకి కేంద్రం పెద్దిరెడ్డే అన్నారు. వేల ఎకరాలను మాఫియా ద్వారా చేజిక్కించుకుని రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారానే పెద్దిరెడ్డి రూ. 1800 కోట్లు వెనకేశారని బోండా ఉమ అన్నారు. అనకొండ పెద్దిరెడ్డి వల్ల శేషాచలం అడవి కూడా మాయమైందన్నారు. పుష్ప సినిమా స్టైల్లో ఎర్రచందనం చెట్లను నరికించి దొపిడీ చేశారన్నారు. అక్రమార్జన ద్వారా ఓట్లను కొనుగోలు చేయాలనేది సీఎం జగన్ వ్యూహమని.. వైసీపీలో అవినీతి అనకొండలు ఎక్కువయ్యారని విమర్శించారు. మంత్రుల అవినీతిపై సీఎం జగన్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.

జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేస్తే రాజీనామాలు చేసిన మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. మామూలు దొంగలను కెబినెట్ నుంచి తప్పించి.. గజ దొంగలను సీఎం జగన్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారా అనే అనుమానం ఉందన్నారు. ఈ స్థాయిలో దొపిడీ చేసిన పెద్దిరెఢ్డిని కెబినెట్టులో కొనసాగిస్తారా..? లేక తప్పిస్తారా అనేది చూడాలన్నారు. పెద్దిరెడ్డితో జగన్ ఉత్తుత్తి రాజీనామా చేయించారనే ప్రచారమూ ఉందని బోండా ఉమా పేర్కొన్నారు.

https://ntvtelugu.com/payyavula-keshav-comments-on-cm-jagan-language/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • BONDA UMA
  • peddi reddy ramachandra reddy
  • Telugu Desam Party

తాజావార్తలు

  • US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

  • Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!

  • Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్

  • LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!

  • US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions