NTV Telugu Site icon

Vishnuvardhan Reddy: ఎవరు దాడి చేసినా తప్పే.. ఎవరి ప్రభుత్వం ఉంది? బాధ్యత ఎవరిది?

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. విశాఖపట్నంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు పవన్‌ కల్యాణ్‌ చేరుకున్న సమయంలో.. గర్జనను ముగించుకుని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వారి కాన్వాయ్‌పై రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తుంది.. ఈ దాడిలో.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కాగా.. కారు అద్దాలు ధ్వంసమైనట్టు చెబుతున్నారు.. అయితే, ఈ దాడిపై స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. దాడి చేశారని మా మిత్ర పక్షంపై ఆరోపణలు చేస్తున్నారు.. ఎవరు దాడి చేసినా తప్పే.. కానీ, ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉంది? రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది?.. ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా జనసేన ప్రభుత్వం ఉందా? అంటూ నిలదీశారు.. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకే రక్షణ లేదా? అంటూ ఎద్దేవా చేసిన విష్ణువర్దన్‌రెడ్డి… శాంతి భద్రతలు లేవా? వాళ్ల మంత్రులకే రక్షణ కల్పించాలేని స్థితిలో సీఎం వైఎస్‌ జగన్ ఉన్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ఘటనలో నిజానిజాలు తేల్చాలని డిమాండ్‌ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి..

Read Also: Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్