NTV Telugu Site icon

Vishnuvardhan Reddy: 2024లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..! మళ్లీ మోడీయే ప్రధాని..

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసింది.. 2024లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు… 2024లో తిరిగి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి… తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో జరుగుతున్న రాజకీయాలు రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.. 40 నెలల వైసీపీ పాలనపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ప్రభుత్వం రహస్య ఆజెండాతో విపక్ష నేతలపై వల విసురుతున్నారని.. ఉద్యమాలను పక్క ద్రోవ పట్టించేలా ప్రభుత్వం పరిపాలన సాగుతోందన్నారు. కుటుంబ పాలన సాగించే వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి.. అభివృద్దే అజెండాగా పాలనను సాగించే బీజేపీ, జనసేనను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: New Bike: ఓరి నీ ఏషాలో.. కొత్త బైక్‌ కొంటే ఇంత రచ్చ చేయాలా..?

రాబోవు 18 నెలలు పాటు వైసీపీ అసమర్ధత పాలనపై నెలకొక్క మేనిఫెస్టోలో అమలు చేయని హామీని ప్రజల ముందు ఉంచుతామన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. 2024లో ప్రాంతీయ పార్టీల శకం ముగిసేలా బీజేపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయన్నారు. మరోవైపు.. తెలంగాణ రాజకీయాలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్‌ రాజకీయ క్రీడ ప్రమాదకరంగా మారిందని విమర్శించారు.. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని ఆరోపించిన ఆయన.. మనుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. ఇక, యువ నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారనుకుంటే… 82 ఏళ్ల ఖర్గేని కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారంటూ ఎద్దేవా చేశారు.. ఈ వయస్సులో ఆయన పార్టీని ఏమి నడపగలడు..? అని ప్రశ్నించారు.. రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదంటూ సెటైర్లు వేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి..