మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్‌బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.…