వివాహేతర సంబంధాలు దారుణాలకు కారణం అవుతున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కొత్త పాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేసారు గుర్తుతెలియని వ్యక్తులు. ప్రస్తుతం ఈ కేసు మిస్టరీగానే కొనసాగుతుంది. మృతదేహం ఎవరిది అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు..ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… హత్య జరిగిన తీరు బట్టి వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
యలమంచిలి నియోజకవర్గం కొత్తపాలెం మండలం చెరుకుల కాటా సమీపంలో నిన్న కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. దొరికిన ఆనవాళ్లు ఆధారంగా ఎక్కడో హత్య చేసి కాల్చి ముక్కముక్కలుగా నరికి మూట కట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు…మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాలు మాత్రమే లభ్యం అయ్యాయి..మరో కాలు చెయ్యి కోసం గాలించనున్నారు పోలీసులు. హత్య చేసి మూడు నాలుగు రోజుల క్రితం శివారులో ఉన్న రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు…దొరికిన భాగాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించారు…పండగా రోజు ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం అని తేలడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న డాగ్స్ స్క్వాడ్ దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు వున్నారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ తో గాలింపు ముమ్మరం చేశారు. ఇంకా కాలువలోనే కొన్ని శరీర భాగాలు వున్నాయి. మృతుడి వయస్సు 45-50 ఏళ్లు ఉండొచ్చని పోలీసుల అంచనా వేశారు. ఇంత దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అయ్యుండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. గత నాలుగైదు రోజుల క్రితం మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్న్నారు పోలీసులు.
Read Also: Allu Arjun: అత్తగారింట్లో పుష్ప రాజ్ సంక్రాంతి సంబరాలు