Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్‌పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్…
డేటా చౌర్యంపై అమరావతిలోని సచివాలయంలో హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించారని.. పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం…
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న…