Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- తుపానుగా మారే అవకాశం
- ఉత్తరాంధ్ర తీరానికి వాతావరణ హెచ్చరిక
- మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది క్రమంగా బలపడి రాగల రోజుల్లో తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారి, ఆ తర్వాత ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర , రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి , అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read
- Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
- AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
- AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
- Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
గడిచిన కొద్ది గంటల్లో కర్నూలు, నంద్యాల, తిరుపతి, పల్నాడు , ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు కోరారు. ప్రజలు అత్యవసర సహాయం లేదా తుపాను సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 , 18004250101 సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!