Rain Alert In AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Typhoon Nanmadol: జపాన్ దేశాన్ని అత్యంత శక్తివంతమైన తుఫాన్ నన్మదోల్ భయపెడుతోంది. తీరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తీర ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నన్మదోల్ టైఫూన్ వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో రవాణా సేవలు స్తంభించాయి. నైరుతి జపాన్ లోని కగోషిమా ప్రిపెక్చర్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో భారీగా గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు సముద్రంలో ఎతైన అలలు వస్తున్నాయి.…