Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Barasala For Cow Calf In Kakinada District

Viral News: ఆవు దూడకు బారసాల అదిరేలా.. ఎక్కడంటే…?

Published Date :June 15, 2022 , 3:53 pm
By NTV WebDesk
Viral News: ఆవు దూడకు బారసాల అదిరేలా.. ఎక్కడంటే…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెళ్ళి, సీమంతం, ఆషాఢమాసం సారె, సంక్రాంతికి ఇంటి అల్లుడికి అదిరిపోయే మర్యాదలు, వియ్యపురాలి సారె… కోడిపందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. అక్కడ ఏ వేడుక జరిగినా బ్రహ్మాండంగా వుంటుంది. అమ్మాయో, అబ్బాయో పుట్టినా.. వారికి బారసాల చేయడం ఆనవాయితీ. కాకినాడ జిల్లాలో ో పెద్దాయనకు ఆవులు, ఆవుదూడల్ని పెంచడం హాబీ. తన కుటుంబంలో సభ్యులుగా వాటిని సాకుతుంటారు.

తాజాగా 3నెలల పుంగనూరు ఆవు దూడకు బారసాల చేశారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. వేదమంత్రాలతో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో శాస్త్రోక్తంగా జరిపిన వేడుక జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. నా బారసాలకు రండి అంటూ పుంగనూరు ఆవుదూడ పిలిచినట్టుగా ఆహ్వాన వీడియో తయారుచేశారు. బంధువులు అంతా తరలి రాగా.. చిన్నపిల్లల్ని వేసినట్టు ఉయ్యాలలో వేసి జోలపాడారు. ఆ లేగదూడను పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. ఆ లేగదూడ కూడా వీరికి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ బారసాలకు వచ్చిన బంధువులు కూడా వీరి అనుబంధాన్ని చూసి నవ్వుకున్నారు.

గత ఏడాది కాకినాడ సమీపంలోని యానాంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో పెళ్ళయింది. సారెలో భాగంగా అల్లుడికి పెళ్ళికూతురు తండ్రి భారీగా సారె పంపారు.

వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లికొడుకు పవన్ ఇంటికి చేరాయి. ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్‌ కుమార్‌. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. అట్లుంటాది మరి గోదారోళ్ళ మర్యాదలు, ఆప్యాయతలు.

Jabardasth: ‘అదిరే అభి’కి ప్రమాదం.. చేతికి 15 కుట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • barasala
  • cow calf
  • cow festival
  • Cradle festival
  • Dr Gowri shankar

తాజావార్తలు

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

  • Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

  • Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions