సెప్టెంబర్ 1న చలో విజయవాడ,అలాగే సీఎం ఇంటి ముట్టడికి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ఎటువంటి అనుమతులు లేవన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. వార్షిక తనిఖీలలో భాగంగా రేపల్లె పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు ఎస్పీ వకుల్ జిందాల్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ సెప్టెంబర్ 1న ఉపాధ్యాయులు ఇచ్చిన చలో విజయవాడ పిలుపునకు ఎటువంటి అనుమతులు లేవని చలో విజయవాడ వెళ్లిన వారిని అక్కడ పోలీస్ వారికి దొరికితే దొరికిన ఉద్యోగులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: JP Nadda : టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉంది
ఇప్పటికే నోటీసులు అందజేశామని ఎస్పీ తెలిపారు. దయచేసి ఉద్యోగులు అందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపల్లె మండలం లోని లంకెవానిదిబ్బ గ్రామంలో ని దేవాలయంలో జరిగిన వేలంపాట గురించి వైరల్ అయిన వీడియో గురించి మాట్లాడారు ఎస్పీ వకుల్ జిందాల్. ఆ దేవాలయంలో జరిగిన వేలంపాట నాటు సారా, బెల్ట్ షాపులకు సంబంధించినది కాదన్నారు. అక్కడ జరిగిన వేలం పాట ఫిషింగ్ కు సంబంధించినదని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపారు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా పందిళ్ళు ఏర్పాటు చేసే వారు ముందుగా నియమ నిబంధనలు పాటించాలని అన్నారు .మొట్టమొదటగా గ్రామపంచాయతీలో పర్మిషన్ తీసుకోవాలన్నారు. అలాగే ఫైర్ స్టేషన్ విద్యుత్తు డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి అలాగే పోలీస్ స్టేషన్ నుంచి మైక్ పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. పందిళ్ళు ఏర్పాటు చేసే వ్యక్తులు ఒక కమిటీగా ఏర్పడి పందిళ్ళ వద్ద 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వినాయక చవితిని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు.
Read ALso: కడుపులోని ఈ సమస్యలకు చెక్ పెట్టే పదార్థాలు