కడుపులోని ఈ సమస్యలకు చెక్ పెట్టే పదార్థాలు
ఏలకులు: ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి గ్యాస్, మలబద్ధకం, వికారం సమస్యలను తగ్గిస్తాయి
అల్లం: వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, ఇతర ప్రేగు సమస్యలకు ఆయుర్వేద నివారణగా అల్లంను చాలాకాలం నుంచే వినియోగిస్తున్నారు
పసుపు: ఇందులోని పోషకాలు.. అజీర్ణం, మంటను నివారిస్తాయి. అలాగే.. మధుమేహం, అలెర్జీలు, గౌట్, అల్జీమర్స్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి
జీలకర్ర: ఉబ్బరానికి జీలకర్ర ఒక అద్భుతమైన ఔషధం. ఇది అజీర్ణం, అసిడిటీని ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. దీనిని మితంగా తీసుకోవాలి
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రేగు సిండ్రోమ్, గ్యాస్, మలబద్ధకం వంటి వివిధ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
లవంగాలు: జీర్ణశయాంతర ప్రేగులకు ఈ లవంగాలు చాలా మంచివి. ఇది అతిసారం యొక్క లక్షణాల నుండి విముక్తి కలిగిస్తుంది