NTV Telugu Site icon

Bank Robbery: తుపాకీతో బెదిరించి.. బ్యాంకు దోపిడీ

Gun1

Gun1

తుపాకీతో బెదిరించి బ్యాంకులో దోపిడీ | Bank Robbery in Anakapalle District | Ntv

అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి.

శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ముగ్గురు సిబ్బంది పనిచేసే బ్రాంచ్ లో మిగిలిన సిబ్బంది భోజనానికి వెళ్లగా…క్యాషియర్ ప్రతాప్ రెడ్డి ఒక్కరే వున్నారు. సరిగ్గా 2.07 నిముషాల సమయం…హెల్మెట్, బ్యాగ్,జర్కిన్ ధరించిన ఓ యు వకుడు బైక్ పై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంక్ లోకి ప్రవేశించి నేరుగా క్యాష్ ఇయర్ దగ్గరకు వెళ్ళాడు.ప్రతాప్ రెడ్డికి తుపాకీ ఎక్కుపెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించాడు ఆగంతకుడు. ఈ అనూహ్యమైన ఘటనతో షాక్ గురైన క్యాష్ ఇయర్ తేరుకునే లోపే కౌంటర్లోని 3ల క్షల 30వేలుతో పరారయ్యాడు.

రెండు నిముషాలు వ్యవధిలోనే చోరీ జరగగా ఈ ఘటన చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయి. రాబరీ చేసింది ఉత్తరాది ముఠా గా భాషను బట్టి అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు విస్త్రతంగా గాలింపు చేపట్టాయి ప్రత్యేక బృందాలు. అనకాపల్లి జిల్లా పోలీసులకు దోపిడీ ముఠా సవాల్ విసిరింది.ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను పట్టపగలు దోచేసింది. రెండంటే రెండు నిముషాల్లో అత్యంత చాకచక్యంగా పని కానిచ్చేసి పరారైపోగా… ఈ చోరీ వెనుక ఉన్నది ఒకరు, ముఠాన అనేది అంతుబట్టడం లేదు.

సీసీ ఫుటేజ్ పరిశీలించి నప్పుడు రాబారీకి వచ్చిన వ్యక్తి , బయట మరొకరు తిరిగుతున్నట్టు కనిపించింది. దీంతో వీరిద్దరూ ఒక్కరేనా వేరు వేరా అనేది తేలాలి. రాబరీ తర్వాత నిందితుడు పరారవ్వగా అదే సమయంలో దాదాపుగా ఒకే మోడల్ బైక్ లు అక్కడి నుంచి వెళ్లడం కనిపించింది. బ్యాంక్ లో దోపిడీ చేయడం అంటే ఒక పథకం ప్రకారం చేసి ఉంటారనేది పోలీసులు అనుమానం. ఎప్పుడు ఖాతాదారులు ఉండరు..?.సిబ్బంది భోజనాలకు ఎప్పుడు వెళతారు వంటివన్నీ పక్కాగా రెక్కీ వేసుకునే వచ్చినట్టు కనిపిస్తుంది. క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలు సేకరించగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దోపిడీ తర్వాత నిందితులు ఎటు వెళ్లారనేది సస్పెన్స్ గా మారింది. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంక్లను టార్గెట్ చేసిన ముఠా పనే అయి వుంటుందనే అనుమానాలు ఉన్నాయి.