TDP Leader, Former Minister Ayyana Patrudu Visited Underground Mines Department.
అనకాపల్లి భూగర్భ గనుల శాఖ కార్యాలయానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి డివిజన్ పరిధిలో ఉన్న క్వారీలు క్రషర్ ల అనుమతుల పై మైన్స్ ఏడీని అయ్యన్న పాత్రుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి ఏడీ పరిధిలో 340 క్వారీలు ఉండగా కేవలం 41 క్వారీలకు మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్నాయని, మిగతావన్నీ అక్రమ క్వారీలే అంటూ ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అధికారులు నాయకుల కనుసన్నల్లో అక్రమ క్వారీల నడుస్తున్నాయని ఆయన విమర్శించారు.
అధికారులు తక్షణం వీటన్నింటిపై చర్యలు తీసుకోకపోతే అనకాపల్లి మైనింగ్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగుతామని ఆయన వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న అక్రమ క్వారీల మైనింగ్ పై అసెంబ్లీలో లేవనెత్తతామని ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.