Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Apcc Chief Gidugu Rudraraju Comments After Meeting With Mallikarjun Kharge

Gidugu Rudraraju: ఏపీలో నిశ్శబ్ద విప్లవం రానుంది.. ప్రజలంతా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు

Published Date :June 17, 2023 , 9:57 pm
By NTV WebDesk
Gidugu Rudraraju: ఏపీలో నిశ్శబ్ద విప్లవం రానుంది.. ప్రజలంతా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

APCC Chief Gidugu Rudraraju Comments After Meeting With Mallikarjun Kharge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రానుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించానని అన్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తాను చేపట్టిన పలు ప్రజా కార్యక్రమాల వివరాలను ఖర్గేకు అందజేశానని చెప్పారు. ఖర్గేను ఏపికి రావాలని ఆహ్వానించానన్నారు. విశాఖపట్నం, రాయలసీమలో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభలకు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.

Actor Yash: ఎట్టకేలకు ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..?

జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు కురిపించడం ఆశ్చర్యంగా ఉందని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఇన్నాళ్లూ అన్ని రకాలుగా అధికార వైసీపీ మద్దతు తీసుకొని.. ఇప్పుడు హఠాత్తుగా విమర్శలు చేయడం షాక్‌కి గురి చేసిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన ఓటర్లందరూ.. తిరిగి వస్తారని విశ్వాసం తమకుందన్నారు. రెండు ప్రాంతీయ పార్టీల (టీడీపీ, వైసీపీ పార్టీలను ఉద్దేశించి) పాలన చూసిన ప్రజలు.. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ఏపీ ప్రజలు మద్దతివ్వాలని అభ్యర్థించారు. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో రాబోయే ఎన్నికల్లో.. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.

Green Card: ఇండియన్స్‌కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • apcc chief gidugu rudraraju
  • Mallikarjun Kharge
  • rahul gandhi
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

  • Balakrishna : లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న బాలయ్య

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • Telangana: తెలంగాణలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సప్లైపై కీలక అప్‌డేట్..

  • Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions