ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు అవినీతి అధికారులు మాత్రం దొరికినంత దోచుకో అనే తరహాలో ముందుకు సాగుతున్నారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ. జిల్లాలో కొన్ని రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అక్రమాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ల దగ్గర మొదలై.. నకిలీ చలానాలు సృష్టించడం.. అసలు చలానాలే లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేంత బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో సీఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల లావాదేవీలు, వాటి చలాన్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేయగా… ఇప్పటివరకు ఆరు డాక్యూమెంట్లకు సంబంధించి 16 నకిలీ చలానాల ద్వారా 2.96 లక్షలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరో 38 దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం వివిధ పద్దుల కింద 107 చలానాలపై సొమ్ము చెల్లించారు.
సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమకాలేదు. దీనిపై ప్రాథమికంగా పరిశీలించకుండానే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేశారు. 2018-19కి సంబంధించి 21.29 లక్షల సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరలేదని గుర్తించారు అధికారులు. గతంలో కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ నాసిర్ ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లటంతో ఇన్ ఛార్జిగా పనిచేసిన జానియర్ అసిస్టెంట్ హరీష్ కూడా నకిలీ చలానాల ఆధారంగా 4 దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేశారని అధికారుల తనిఖీల్లో తేలింది. మూడేళ్ల డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిషేధిత భూములకు, ప్రభుత్వ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ సాగుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?