Dharmavaram Erraguttta: ఎర్రగుట్టే హాట్ టాపిక్.. ఏమా కథాకమామీషు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఊరికి ఏ నాయకుడు వచ్చినా.. ఆ ఎర్రగుట్ట వైపే చూస్తారు.. అక్కడ నిర్మించుకున్న ఒక అందమైన కోటను చూస్తారు.. కానీ ఆ అందమైన ఎర్రగుట్ట చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ సాగుతోంది. నారా లోకేష్ వచ్చి ఆ ఎర్రగుట్ట వైపు వేలు చూపిస్తే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోటోలు తీయించి.. మరీ దాని గురించి ప్రశ్నిస్తున్నారు. ఇక లోకల్ లీడర్లు అయితే పుంఖాలు పుంఖాలుగా ఆ గుట్ట కథలు చెబుతున్నారు. అసలేంటి ఆ ఎర్రగుట్టలో నిర్మించిన కోటలో ఎవరున్నారు.. ఆ గుట్టపై వస్తున్న ఆరోపణల మీద అక్కడున్న రాజు ఏమంటున్నారు.. ఆ గుట్ట గుట్టు గూగూల్ మ్యాప్ వరకు వెళ్లడమేంటి.. ఎందుకిది రాష్ట్రంలో డిస్కషన్ పాయింట్ గా మారింది….
ధర్మవరం… పట్టుచీరలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది… ఇక్కడికి ఎవరొచ్చినా పట్టుచీరలు చూసేందుకే వస్తారు.. కానీ ఇప్పుడు ఏ నాయకుడొచ్చినా.. అంతా ఎర్రగుట్ట వైపు చూస్తున్నారు. ఇంతకీ ధర్మవరంలో ఎర్రగుట్ట ఎక్కుడుంది అంటే. ధర్మవరంకి ఒక అందమైన చెరువు. జిల్లాలో రెండవ అతి పెద్ద చెరువు అది. ఒక నదిలా కనిపించి చెరువుకు అనుకుని ఒక కొండ ఉంది. అది చూసేందుకు ఎర్ర మట్టితో ఉంటుంది. అందుకే దానిని ఎర్రగుట్ట అంటారు. ఆ గుట్ట దిగువ భాగంలో చెరువుకు ఆనుకుని ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు. ఈ గెస్ట్ హౌస్ ఎవరిది అంటే.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది. అందుకే ఇది అంత వివాదంగా మారింది. ఆయన అక్కడ చెరువులో బోటింగ్ చేసేందుకు బోట్లు, గుర్రాలు, కాస్ట్లీగా ఉండే ఏటీవీ వాహనాలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యేకి ఇంత రాజభోగమా.. ఏంటిది.. అదే ప్రతి పక్షాల ప్రశ్న. లోకేష్ వేలెత్తి చూపిస్తున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా ఈ గుట్ట గురించే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ కేతిరెడ్డే అయ్యారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
Read Also: Jyotiraditya Scindia: కాంగ్రెస్‌కు దేశద్రోహి అనే సిద్ధాంతం… రాహుల్ పై సింధియా ఆగ్రహం
ఇంతకీ వారంతా చెప్పొచ్చేది ఏంటంటే.. ఆయన నిర్మించుకున్న ఎర్రగుట్ట ఫాంహౌస్ రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నదని.. అందులో చెరువు భూమిని కూడా ఆక్రమించుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారనేది ఆరోపణ. దీనిపై మొదటి నుంచి లోకల్ గా ఉన్న నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే దానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సమాధానం ఇస్తూనే ఉన్నారు. దీనిపై కొన్ని రోజుల క్రితం జనసేన నేత పవన్ కళ్యాణ్ కొన్ని ఫోటోలు చూపిస్తే కామెంట్ చేయడం.. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఆ చెరువు మీదుగానే వచ్చారు. ఆ సమయంలో డ్రోన్ వీడియోలు తీసి.. ఇదిగో కేతిరెడ్డి అక్రమాలంటూ వేలు పెట్టి చూపించారు. దీంతో ఇది రాష్ట్రంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వరకు అక్కడ నిర్మించుకున్న భవనం ఎవరూ చూడలేదు. కానీ ఇప్పుడు అందరూ చూసి ఇంత అందమైన ప్లేస్ లో రాజభోగాలతో భవనం ఏంటి అని ఆశ్చర్యపోయారు. కేతిరెడ్డి భూ ఆక్రమణల గురించి లోకేష్ చాలా విమర్శలు కూడా చేశారు…
లోకేష్ ధర్మవరం వచ్చి సవాల్ విసిరి వెళ్తే.. కేతిరెడ్డి ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దకు వెళ్లి ఛాలెంజ్ చేశారు. ఆ ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేతిరెడ్డి అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ప్రతి సవాల్ విసిరారు. దీంతో నారా లోకేష్ పాటు పరిటాల శ్రీరామ్ ఆధారాలను బయటపెట్టారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తీసిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఎర్రగుట్టపై ఉన్న భూముల్ని రైతుల నుంచి కొన్నానని కేతిరెడ్డి అంటున్నారని.,, రెవెన్యూ రికార్డులు, రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఎమ్మెల్యే తమ్ముడి భార్య పేరుతో కొనుగోలు చేసింది 25.38 ఎకరాలు మాత్రమే.
అయితే, గుట్టపై మొత్తం 45 ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆక్రమణలో ఉందని….మిగిలిన 20 ఎకరాలు కబ్జాచేశారని స్పష్టంగా అర్థమౌతోందంటూ.. ఆరోపణలు చేశారు. కానీ కేతిరెడ్డి మాత్రం వీరు చేస్తున్న ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చారు. తాను కట్టుకున్నది 25.38ఎకరాల్లోనేనని అది లోకేష్ వచ్చి లేదా పవన్ కళ్యాణ్ వచ్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. అది తనదేనని చెబుతున్నా కదా అంటున్నారు. కానీ ఆక్రమించారన్న దానికి సాక్షం చూపండి అంటూ కేతిరెడ్డి అన్నారు. నా భవనం చుట్టూ భూమి ఉంటి నేను ఆక్రమించుకున్నట్టా.. రికార్డుల్లో ఎంత భూమి ఉందో అది నాదేనని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎర్రగట్ట రాజకోట రహస్యంలా మారిపోయింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా ప్రతిపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తున్నా.. కేతిరెడ్డి మాత్రం ఏ విచారణ అయినా చేసుకోవచ్చని.. నేను చేసిందంతా లీగల్ అంటూ కూల్ గా చెబుతున్నారు కేతిరెడ్డి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!