CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రశంసించారు. తమ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత రాష్ట్రానికి గర్వకారణమని వారు అభినందించారు. పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బాబురావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు…