NTR Vaidya Seva Scheme: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
- నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
- రూ.3000 కోట్ల బకాయిలపై ఆసుపత్రుల ఆగ్రహం
- UHC విధానంపై తీవ్ర అభ్యంతరాలు
- పేద రోగులకు వైద్యం అందక ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నేటి నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా పేరుకుపోయిన భారీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, పాత ప్యాకేజీ ధరలనే కొనసాగించాలన్న మొండి వైఖరిని నిరసిస్తూ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు నెలల కాలంలో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,500 కోట్ల నుండి ఏకంగా రూ. 3,000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంతో చిన్న తరహా ఆసుపత్రులు నిర్వహణ భారమై మూతపడే స్థితికి చేరుకున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
బకాయిల సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై కూడా ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ప్రామాణికంగా తీసుకుని ఇన్సూరెన్స్ మోడల్‌లో చెల్లింపులు చేస్తామనడాన్ని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తోసిపుచ్చారు. పెరిగిన మందుల ధరలు, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు , సిబ్బంది జీతాల దృష్ట్యా పదేళ్ల క్రితం నాటి ధరలతో నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యాకేజీలను సవరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 3,000 కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం , ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!