జూ.ఎన్టీఆర్ వస్తాడేమోనని భయం..! గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్‌సింగ్ కాలేడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పేర్నినాని… ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్‌ది అని మండిపడ్డ ఆయన.. ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి… మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు.. కానీ, వాళ్లని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి పేర్నినాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. కానీ, పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లడం శోచనీయం అన్నారు మంత్రి నాని.. వాళ్లకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేయాలి.. కానీ, రాజకీయం చేయడం ఏమిటి..? అని ప్రశ్నించిన ఆయన… ఇన్ని చేస్తున్నా మనిషి ముసుగులో ఉన్న మృగాలు మానవత్వం లేకుండా విరుచుకుపడుతున్నాయన్నారు.. లోకేష్ ఉద్యోగం ఓడిపోయిన రాజకీయ నిరుద్యోగి… ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో అనే భయంతో విచక్షణ మరిచి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు.. చుట్టూ ఉన్న 10 మందితో చప్పట్లు కొట్టించుకోవడం కాదు.. 5 కోట్ల ఆంధ్రులతో చప్పట్లు కొట్టించుకోగలగాలని హితవుపలికిన మంత్రి పేర్నినాని.. భయపడి చచ్చే వారే ఛాలెంజ్ చేస్తున్నారు… లెక్కలు తీయడం మొదలెడితే కక్ష సాధింపు అంటారని.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడు అంటూ కామెంట్ చేశారు..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!