జగ్గంపేట మం. జడ్ రాగంపేటలో దిశ యాప్ అవగాహన సదస్సులో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ…. మహిళల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ దిశ చట్టం ఏర్పాటు చేసారు. దిశ చట్టం ద్వారా 7 రోజుల్లోనే నిందితులకు శిక్ష.. అత్యాచారాలపై దిశ చట్టం ద్వారా ఉరిశిక్ష విధించవద్దు అని పేర్కొన్నారు. విజయవాడలో చిన్నారిపై జరిగిన సంఘటలో 4 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారయ్యింది. దిశ చట్టం కేసులకు సంబంధించి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు.. తక్షణ సహాయం కోసం దిశ యాప్ ఉపయోగపడుతుంది. దిశ యాప్ ను యవతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.