Heat Stroke: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వడగాలులు తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో వడదెబ్బ (Heat Stroke) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను “రాష్ట్ర విపత్తు”గా పరిగణిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా మాత్రమే అందించబడుతోంది. అయితే, ఇప్పుడు…