NTV Telugu Site icon

Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి..

Revuenuw

Revuenuw

Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్ ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో తాము గమనించిన ఆఫీస్ సెటప్ లో మార్పులు తీసుకురావాలని నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు సర్క్యులర్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఆరేంజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ పేర్కొనింది.

Read Also: China:10 ఏళ్ల అబ్బాయిల మూత్రంలో ‘ఆధ్యాత్మిక శక్తులు’..యూరిన్ తాగితే దుష్టశక్తుల దూరమవుతాయట!

ఇక, సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ వున్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్ లో ఉండాలని ఆయన చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. భూములు రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీస్ లో అత్యధిక గౌరవం ఉండాలి అని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చినవారు నిలబడి వుండే విధానానికి స్వస్తి పలికారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచినీరు ఆఫర్ చేసి గౌరవించాలని ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా సర్క్యులర్ జారీ చేశారు.