Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్ ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు.