దేవదాయ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. కార్యాలయంలోనే అధికారులు గొడవలు పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్… విశాఖ రగడపై రాజమండ్రి ఆర్జేసీ సురేష్ బాబుని విచారణాధికారిగా నియమించిన వాణిమోహన్.. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ఆర్జేసీని ఆదేశించారు.. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది… ఇక, ఈ తరహా ఘటనల విషయంలో అవసరమైతే ఉద్యోగుల టెర్మినేషన్ వరకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం.. కాగా, విశాఖ డీసీ తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండగా, ఏసీ శాంతి చాంబర్‌లోకి ప్రవేశించి, చేతితో తెచ్చిన ఇసుకను ఆయన ముఖంపై విసిరి దుర్భాషలు ఆడడం చర్చగా మారింది.. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.. దీంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్. మర్యాదలే చేశామని పలువురు సిబ్బంది తెలిపారు.