AP Bar License: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త బార్ పాలసీకి వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ గడువును పొడిగించింది. బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు ఆగస్టు 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, లాటరీ డ్రా ఆగస్టు 30వ తేదీన ఉదయం 8 గంటలకు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. వినాయక చవితి, బ్యాంకు సెలవులు, నిరంతర వర్షాలు వరదల కారణంగా దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు తలెత్తాయని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు.
Read Also: Nagole : 63 అడుగుల భారీ ఎత్తులో పూర్తిగా మట్టితో వినాయకుడు
ఈ సందర్భంగా ఏపీ ఎక్సైజ్ కమీషనర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు ఆగస్టు 29వ తేదీ వరకు పొడిగించాం.. ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు లాటరీ డ్రా తీస్తామన్నారు. వరుసగా పండగలు, వర్షాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామన్నారు. కొత్త గడువులపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.