CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో

  • ఈహెచ్‌ఎస్ బిల్లుల చెల్లింపులో ఆన్‌లైన్ విధానం అమలు
  • మధ్యవర్తుల పాత్రకు ముగింపు.. వేగవంతమైన చెల్లింపులు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యం
  • ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో పారదర్శకత పెంపు
Telugu Diaspora Chandrababu

Telugu Diaspora Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) నిర్వహణలో సమూల మార్పులు శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా ఈహెచ్‌ఎస్ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఇకపై అన్ని రకాల లావాదేవీలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్..

ఈ నూతన విధానం ద్వారా ఆసుపత్రులు అందించే చికిత్స బిల్లులు నేరుగా ఆన్‌లైన్ ద్వారానే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి చేరుతాయి, తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఈహెచ్‌ఎస్ విధానాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించి, ఉద్యోగులు , పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరింత సరళీకృతమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాత పద్ధతిలో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఆసుపత్రులకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని, తద్వారా ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) నిరంతరాయంగా అందాలని ఆయన స్పష్టం చేశారు.

Minister Seethakka : మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.!

ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రంగంలోకి దిగి, ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు.