CM YS Jagan Great Heart: బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు.. 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా.. మొహ్మద్ అలీ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో.. దయార్థ హృదయాన్ని చూపారు సీఎం.. వెంటనే బాధిత బాలుడి తల్లికి ఆర్థికంగా సాయం చేయాలని, నెలవారి పెన్షన్ వచ్చేలా చూడాలని.. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Read Also: Power Charges: మళ్లీ విద్యుత్ చార్జీల మోత..! తెలంగాణ ఈఆర్సీకి ప్రతిపాదనలు..
Also Read
పూర్తి వివరాల్లోకి వెళ్తే టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభకు హమీద అనే మహిళ మహ్మద్ అలీ అనే తన కుమారుడిని ఎత్తుకుని వచ్చారు.. తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్ధికస్తోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. వివరాలు ఆరా తీసిన పిదప.. విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ గిరీష వెంటనే స్పందించి కార్యక్రమ అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రూ. 1,00,000 రూపాయల చెక్కును హమీదకు అందించారు. అలాగే నెలవారీ 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ సూచించారు.. తన మంచి మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు హమీద.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!