వ్యాక్సిన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది.. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వడం లేదు.. ఇక, కోవిడ్ వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కీలక వ్యాఖ్యలు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందన్న ఆయన.. వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.. దేశంలో వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు.. వాటిలో కోటి వాక్సిన్లు కోవాగ్జిన్, మిగిలినవి కోవీషీల్డ్ అని.. ఇప్పుడు వ్యాక్సినేషన్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదు అన్నారు.
ఇక, దేశంలో వ్యాక్సిన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్ ఇవ్వొచ్చని అంచనా వేసిన ఆయన.. ఆ మేరకు వారికి వాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందన్నారు.. అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్ చేయగలుగుతామన్నారు.. ఇదీ వాస్తవ పరిస్థితి అని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం.. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి.. అందుకే శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!