Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan Review Meeting On Education Department

CM YS Jagan: విద్యాశాఖపై సీఎం సమీక్ష.. ప్రతి విద్యార్థిని ట్రాక్‌ చేయాల్సిందే..!

Published Date :April 10, 2023 , 4:34 pm
By Sudhakar Ravula
CM YS Jagan: విద్యాశాఖపై సీఎం సమీక్ష.. ప్రతి విద్యార్థిని ట్రాక్‌ చేయాల్సిందే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలని స్పష్టం చేశారు.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం.. ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందని.. ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి.. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్‌ చేస్తున్నాం.. అందుకే డ్రాప్‌అవుట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు.

ఇక, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.. విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే, మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సీఎంకు తెలియజేశారు.. మరోవైపు.. సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష చేపట్టారు.. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం. దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు.. గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులు ఉండాలన్నారు. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు తెలిపారు.

మరోవైపు.. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.. పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశించారు.. ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నారు. పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు.. ఇక, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై కూడా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.. సీఎం ఆదేశాల మేరకు జూన్‌ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

స్కూలు పిల్లలకు టోఫెల్‌ సర్టిఫికేట్‌ పరీక్షలపై సీఎం సమీక్షించారు.. 3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు.. ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌.. 6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు.. వీరికి జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ పరీక్షలు.. మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్‌ పరీక్ష నిర్వహించాలని.. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష జరగాలన్నారు. జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పరీక్ష ఉండాలని.. ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఈ– కంటెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. ఇక, విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్‌ఓపీ తయారుచేశామన్నారు. ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్నారు. ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అధికారులు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. నో మొబైల్‌ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్‌ అనుమతిలేదని తేల్చిచెప్పారు. ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామని.. దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్‌ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.. ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామని.. ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్నారు.. ఇక, మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశించారు.. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తిస్థాయిలో చేయాలన్న ఆయన.. ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్‌ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. మరోవైపు.. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపైనా సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Education
  • Education Department
  • Schools

తాజావార్తలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

  • Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

  • AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions