YS Jagan Mohan Reddy: మోటార్లకు మీటర్లపై సీఎం సమీక్ష.. చాలా విద్యుత్ ఆదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్ల ద్వారా చాలా విద్యుత్ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయనకు.. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని వివరించారు విద్యుత్‌శాఖ అధికారులు.. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశారు.. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం కీలకంగా మారింది.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కీలక సూచలన చేశారు.. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని.. విదేశీ బొగ్గు ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు.. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని.. సులియారీ, మహానది కోల్‌బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
ఇక, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.. అయితే, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం.. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆయన.. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్నారు.. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుంది.. దీని వల్ల సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది.. దీని వల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవన్నారు.. రైతులకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి.. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని.. అక్కడ నుంచి ఆ డబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుందని.. దీని వల్ల రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది.. దీని వల్ల చాలా విద్యుత్ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు.. ఈ సమావేశంలో.. పోలవరం విద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు వివరించిన అధికారులు.. ఇప్పటికే టర్బైన్ మోడల్ టెస్ట్ ముగిసిందని, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు… పవర్ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.. అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తయ్యిందని సీఎంకు వివరించారు.. టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!