ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు జగన్. పోలవరం, రీసోర్స్ గ్యాప్‌కింద నిధులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పీఎంకు వినతిపత్రం అందించి, వాటిపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులకోసం తన సొంతంగా రూ. 2900 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని, వీటిని వెంటనే రియంబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరిన సీఎం. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా రియంబర్స్ విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం ఏర్పడుతోందని వెల్లడించిన సీఎం. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణలోకి తీసుకుని ఆమేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.
– చేసిన పనులకు 15 రోజుల్లోగా రియంబర్స్‌చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.రీసోర్స్‌గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు‡చేయాలని ప్రధానిని కోరారు సీఎం. 2014–15 కాలానికి సంబంధించిన బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల రూపంలో, పెన్షన్లు తదితర రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈనిధులను మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు జగన్. జాతీయ ఆహార భద్రతా చట్టంకింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడంవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఇదివరకే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ప్రధానికి వివరించిన సీఎం. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థద్వారా రేషన్ అందుతోందని తెలిపారు.
Read Also: Chiranjeevi Vs Nagarjuna: అది జరిగితే సంచలనమే!
చట్టం నిర్దేశించిన ప్రకారమే గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మందికి, అర్బన్ ప్రాంతంలో 50శాతం మందికి పీడీఎస్‌కింద ప్రయోజనాలు అందాల్సింది ఉందని తెలిపారు. ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌రాష్ట్రాల్లో రాష్ట్రంకంటే కనీసంగా 10శాతం మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారని వివరించారు. దీనివల్ల అర్హులైన వారికి రాష్ట్రంలో వర్తింపు కావడంలేదని, కేంద్రం ఇస్తున్నదానికంటే అదనంగా దాదాపు 56లక్షలమందికి పీడీఎస్‌ను రాష్ట్రమే వర్తింపు చేస్తోందని తెలిపారు. స్థిరంగా ఖనిజం రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత కీలక అంశమని తెలిపారు. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలను కోరారు. 14 ఏరియాల కేటాయింపు అంశం ఇంకా పెండింగులో ఉందని వివరించారు జగన్. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని ప్రధానికి తెలిపారు.