ఏపీ సిఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ వల్ల సిఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలని భావించినా.. జగన్ మాత్రం పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం రోజున సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్ళి.. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవాలని ముందు భావించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు సిఎం జగన్. కానీ ఇంతలోనే సిఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కాగా.. వ్యాక్సిన్ విషయంలో సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయటం, రఘురామ ఎపిసోడ్ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.